YSR Congress Party MLA Virupakshi addressing the public and assuring support to every family.YSR Congress Party stands as a strong support for every household, says MLA Virupakshi.
YSR Congress Party MLA Virupakshi addressing the public and assuring support to every family.

మన భవిష్యత్తుకు నిజమైన భరోసా కావాలంటే.. మన ఇంట సంక్షేమం తెచ్చిన జగనన్నకి మద్దతుగా నిలుస్తూ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం: ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు

ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో స్థానిక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు పాల్గొన్నారు

వైయస్‌ఆర్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా ఉనేబది జ్యోతి గారికి, ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిమ్మాపురం వెంకటలక్ష్మి గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారికి భారీగా మద్దతు తెలుపుతున్న గ్రామ ప్రజలు.

అనంతరం స్థానిక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు మాట్లాడుతూ..ప్రజలు మాకు ఏ కష్టమొచ్చినా, దుఃఖమొచ్చినా కుటుంబ సభ్యుల్లా అండగా నిలుస్తున్నారని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటాం ప్రజల ఆస్తులకు రక్షణగా మేమంతా నిలుస్తాం. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో సాగుతున్న కూటమి ప్రభుత్వ అరాచకాలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని గెలవాలన్న ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి నేతలకు ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తాము ఇంటింటికీ వెళ్తుంటే వైయస్‌ జగన్‌ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య తేడాను ప్రజలే బేరీజు వేస్తున్నారని తెలిపారు. రెండున్నరేళ్లలో ఈ కూటమి ప్రభుత్వం ఎలా దోపిడీ చేశారో ప్రజలే చర్చించుకుంటున్నారని చెప్పారు. కూటమి వచ్చాక రెండున్నరేళ్లలో భూకబ్జాలు, దందాలు, అరాచకాలు, పెరిగిపోయాయని తెలిపారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేస్తే తామంతా ప్రజలకు, ప్రతి గడపకు కాపలాదారులుగా ఉంటామని.. కూటమి నేతల దౌర్జన్యాలను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మీ ఓటు ద్వారా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు

ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా ఉనేబది జ్యోతి గారికి, మరియు తిమ్మాపురం వెంకట లక్ష్మీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి గ్రామాల అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి తోడుగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీ బుసినే విరుపాక్షి గారు నినదించారు

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *