Maddela Sunil Babu speaking about the goal of providing voting rights to every graduate.Maddela Sunil Babu emphasizes the importance of ensuring voting rights for every graduate.
Maddela Sunil Babu speaking about the goal of providing voting rights to every graduate.

అపార్ట్‌మెంట్లు, ఇళ్లకు వెళ్లి అర్హులకు అవగాహన

గడ్డి అన్నారం,, అక్టోబర్ 29: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని వివిధ అపార్ట్‌మెంట్లు, ఇళ్లకు వెళ్లి పట్టభద్రులకు ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరిస్తూ ఎన్రోల్మెంట్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దెల సునీల్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం నుంచి రాత్రి 7:30 గంటల వరకు నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులను కలిసి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవసరమైన వివరాలను తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మద్దెల సునీల్ బాబు మాట్లాడుతూ, ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అర్హత ఉన్నవారు ఓటరుగా నమోదు చేసుకుని తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కీలకమని, ఈ ప్రక్రియపై మరింత విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వై.వి. కృష్ణారెడ్డి, నాగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *