Students participating in a legal awareness programme to understand laws and their rights.Students should develop awareness of laws, legal rights, and responsibilities.
Students participating in a legal awareness programme to understand laws and their rights.
  • పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన ఉండాలి.
    . జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్

ఆమనగల్లు, మహానది న్యూస్, అక్టోబర్ 29

పోక్సో చట్టంపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జ్ నారం అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకార్ యాదిలాల్, ఉచిత న్యాయ సేవ న్యాయవాది కొప్పు కృష్ణ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గౌడ్ న్యాయవాదులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు న్యాయ సేవలు, పోక్సో చట్టం గురించి న్యాయవాదులు విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు బాలబాలికలు అందరికీ పోక్సో చట్టం రక్షణగా ఉంటుందన్నారు. ఫోక్సో చట్టంలో పొందుపరిచిన సెక్షన్లు, వాటి శిక్షల గురించి విద్యార్థులకు తెలియజేశారు. సోషల్ మీడియా పట్ల విద్యార్థినిలు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోక్సో చట్టం బాలికలకు రక్షణగా ఉంటుందని, సమస్యలు తలెత్తితే న్యాయ సేవలను సంప్రదిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకార్ యాదిలాల్ మాట్లాడుతూ విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల భద్రతగా మెలగాలన్నారు. ఎవరైనా విద్యార్థినిలపట్ల మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తే వెంటనే తమ తల్లిదండ్రులకు తెలపాలన్నారు. పోక్సో చట్టంలో నిందితులకు కఠిన శిక్షలు ఉన్నాయని ఫోక్సో చట్టం బాధితులకు రక్షణగా ఉంటుందన్నారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు అధిరోహించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపరిండెంట్ మురళీధర్, స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డి, న్యాయవాదులు మల్లేష్ గౌడ్, శ్రీనివాస్, మహేశ్వర్, నరేందర్, మహేష్, ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి,ఉపాధ్యాయురాలు తదితరులు ఉన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *