
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, డేగపూడిలో వైయస్ఆర్ సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు
జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల పల్లి సురేష్ కుమార్ రెడ్డి గారికి, ఇనుకుర్తి సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి మంజుల గారికి, ఐదో తారీకు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన కాకాణి గారు
ఎంపీటీసీ, జడ్పీటీసీ, అభ్యర్థులతో కలిసి కరపత్రాలు అందజేసిన కాకాణి గారు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ..
ఎన్నికల్లో బెదిరింపులు, అన్యాయాలపై కాకాణి గారు ధ్వజం..
గత రెండున్నర ఏళ్ల చంద్రబాబు పరిపాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పడ్డాయని, నెల్లూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ రకరకాల బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌లు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అభ్యర్థులకు తెలియకుండానే నామినేషన్లు విత్‌డ్రా చేసి, అక్కడక్కడ ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఏకగ్రీవాలు జరగకుండా, మొత్తం 79 ఎంపీటీసీలు, 5 జడ్పీటీసీల అభ్యర్థులు పోటీలో నిలబడి పోరాడుతున్నారని తెలిపారు. ఈరోజు ధైర్యంగా మేము గ్రామాలలోకి వచ్చి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెబుతున్నామని, కూటమి నాయకులు తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేకపోతున్నారని, ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగే పరిస్థితి లేదని విమర్శించారు
జగన్‌మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు
అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో చదువుకునే బిడ్డ కోసం రూ. 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారని,రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు, ఆటో డ్రైవర్లకు రూ. 10,000 చొప్పున సహాయం అందించడంతో పాటు, ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశారని పేర్కొన్నారు.
పెన్షన్‌ను క్రమంగా పెంచుకుంటూ పోయి, చివరికి రూ. 3,000 అందజేసి ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేయించామని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా, జగనన్న మంజూరు చేసిన పెన్షన్లను ఇవ్వడం తప్ప ఒక్క కొత్త పెన్షన్ అయినా మంజూరు చేశారా అని ప్రశ్నించారు
జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పరిపాలన ఎంతో పారదర్శకంగా సాగిందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక సేవలు నేరుగా వారి ఇంటికే అందాయని కాకాణి గారు కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ సరుకులు, పెన్షన్లు నేరుగా ఇంటి వద్దకే వచ్చాయని, రైతు భరోసా కేంద్రాల (RBK) ద్వారా ఎరువులు, విత్తనాలు, కూడా రైతుల ఇంటి ముంగిటికే చేరాయని ఆయన గుర్తుచేశారు
చంద్రబాబు తన హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని, ప్రజల గురించి ఆలోచించకపోవడం వల్లే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో అడుగుపెట్టిన వెంటనే సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ కనిపించడం జగనన్న బ్రాండ్ పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు 40సార్లు ముఖ్య మంత్రి అయినా కూడా , జగన్ మోహన్ రెడ్డి గారి లాగా ప్రజల కోసం ఆలోచించలేడని విమర్శించారు
రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ సరుకులు, పెన్షన్లు, యూరియా వంటివి డోర్ డెలివరీ కావడం లేదు కానీ,మద్యం మాత్రం డోర్ డెలివరీ అవుతున్నాయని కాకాణి గారు విమర్శించారు
రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని పెట్టి, తగినన్ని బస్సులు లేక, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, 100 బస్సులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారే తప్ప, రెండేళ్ల కాలంలో కొత్త బస్సులు వేసిన దాఖలాలు లేవని, పాత బస్సులకే రంగులు మారుస్తూ కాలం వెళ్లదీస్తున్నారని దుయ్యబట్టారు.
గతంలో ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ఇంటింటికీ వచ్చి ఒక హామీల కాగితం (బాండ్) ఇచ్చి వెళ్లారని, దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సంతకాలు పెట్టి ప్రతి కుటుంబానికి పథకాలు అందిస్తామని ప్రమాణం చేశారని గుర్తుచేశారు
ఇంటింటికీ వెళ్లి సంతకాలు తీసుకున్న సమయంలో “మీకు ఎంతమంది పిల్లలు? పొలం ఎంత ఉంది?” అని వివరాలు రాసుకుని, చివరకు కుటుంబ సభ్యులందరికీ కలిపి కొన్నిచోట్ల సంవత్సరానికి రూ. 2,40,000 ఇస్తామని బాండ్లు ఇచ్చారని తెలిపారు
అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలుచేయకుండా సూపర్ సిక్స్ హామీలన్నీ ఇచ్చేసామని, సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని కర్నూలులో చంద్రబాబు మీటింగ్ పెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు
కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు, బిళ్ల కవితకు కాదు అనర్హం అనే విధంగా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,ఇసుక, మట్టి, గ్రావెల్, లేఅవుట్ల వద్ద డబ్బులు వసూళ్లు ఏది అనర్హం కాదన్నట్లు అందిన కాడికి గుంజుకుంటున్నాడని మండిపడ్డారు.
సోమిరెడ్డికి 2029 లో చంద్రబాబు టికెట్ ఇవ్వడు కాబట్టి, తాను ఇక పోటీ చేయడని గ్రహించి సర్వేపల్లి లో సమస్తం దోచుకుంటున్నాడని, అందుకనే ప్రజల కష్టాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు
ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వం పని చేసింది? ఆ రోజు నేను వచ్చినప్పుడు ఏం పని చేశాను? ఈరోజు ఈ గ్రామాలు బాగుపడ్డాయంటే తాను జిల్లా పరిషత్ చైర్మన్ గా, శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ గ్రామాలకు సంబంధించిన సిమెంట్ రోడ్లు, సైడ్ కాలవలు పూర్తి చేశామని చెప్పారు.
ఇల్లు లేని వారికి, ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మించామని, గ్రామాలకు సంబంధించిన విద్యుత్ సౌకర్యం కల్పించామని , తాగునీటి వసతి, సాగునీటి వసతి కల్పించామని , ఏదైనా ఆయకట్టు లేని భూములను ఆయకట్టులో చేర్పించి, రైతులకు పట్టాలు ఇప్పించామని స్పష్టం చేశారు
సోమిరెడ్డి అందినకాడికి దోచుకుంటూ అవినీతికి మరో రూపంగా సర్వేపల్లి ప్రజలు భావిస్తున్నారని కాకాణి దుయ్య బట్టారు
ప్రజలందరూ ఆలోచన చేసి, మీకోసం కష్టపడే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#VoteForFan
